నిజామాబాదు జిల్లలో విడుదలైన స్కూల్ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్ (SFMG)
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల మరియు మోడల్ పాఠశాలలకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా స్కూల్ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్ (SFMG) విడుదల చేయబడింది.
పాఠశాలల్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్వహించే ఉద్దేశ్యంతో మరుగుదొడ్ల
శుభ్రత, పాఠశాల ఆవరణ శుభ్రత మరియు మొక్కలకు నీరు పోయడం వంటి ఖర్చులను
భరించడానికి ఈ స్కూల్ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్ ఉద్దేశించబడింది.
కొన్ని పాఠశాలల్లో ఇప్పటికే పార్ట్-టైమ్ స్వీపర్లను నియమించారని మరియు వారు శుభ్రత, పారిశుద్ధ్య సంబంధిత కార్యకలాపాలకు హాజరు అవుతున్నారు.
ఒకే రకమైన కార్యకలాపాలకు రెండుసార్లు ఖర్చు చేయడాన్ని నివారించడానికి మరియు SFMG యొక్క సరైన, న్యాయబద్ధమైన వినియోగాన్ని నిర్ధారించడానికి, ఇప్పటికే పార్ట్-టైమ్ స్వీపర్లు ఉన్న పాఠశాలల విషయంలో SFMG విడుదలను ఈ క్రింది నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలని నిర్ణయించడం జరిగింది.
| Enrolment Slab | Existing SFMG Norms per School per Month | Norms Where Part - Time Sweepars are alredy deployed Per School Per Month |
|---|---|---|
| 1 to 30 | Rs. 3,000/- | No Grant |
| 31 to 100 | Rs. 6,000/- | Rs. 3,000/- |
| 101 to 250 | Rs. 8,000/- | Rs. 6,000/- |
| 251 to 500 | Rs. 12,000/- | Rs. 9,000/- |
| 501 to 750 | Rs. 15,000/- | Rs. 12,000/- |
| above 750 | Rs. 20,000/- | Rs. 15,000/- |
Please Post a Comment