మెడికల్ రీయింబర్స్మెంట్ - ఆన్లైన్ విధానం
విద్యాశాఖలో మెడికల్ బిల్లుల పెండెన్సీ తగ్గించడం, పారదర్శకత పెంచడం మరియు ప్రక్రియ వేగవంతం చేయడం కోసం మెడికల్ రీయింబర్స్మెంట్ ప్రక్రియను దశలవారీగా పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకువస్తున్నారు.
● ముఖ్యాంశాలు :
- 18-05-2026 నుండి కొత్త విధానం అమల్లోకి వస్తుంది.
- ఉద్యోగులు ISMS / TG Online Portal ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
- అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లు సంబంధిత అధికారులకు ఆటోమేటిక్‌గా చేరతాయి.
- ఆన్‌లైన్‌తో పాటు ఒరిజినల్ బిల్లులు మరియు జెరాక్స్ కాపీలు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపడం తప్పనిసరి.
₹50,000 లోపు బిల్లుల ప్రక్రియ :
- ఉద్యోగి ఆన్లైన్లో అప్లై చేస్తారు.
- దరఖాస్తు DEO కార్యాలయానికి వెళ్తుంది.
- Clerk → Superintendent → AD స్థాయిల్లో పరిశీలన జరుగుతుంది.
- అవసరమైన పత్రాలు DM&HO కు ఆఫ్‌లైన్ ద్వారా పంపాలి.
- స్క్రూటిని పూర్తయ్యాక DEO ఆమోదం ఇస్తారు.
- Proceedings జారీ అవుతుంది.
₹50,000 పైబడిన బిల్లుల ప్రక్రియ
- అప్లికేషన్ DSC కార్యాలయానికి వెళ్తుంది.
- Clerk → Superintendent → AD ద్వారా పరిశీలన జరుగుతుంది.
- DME / సంబంధిత ఆసుపత్రులకు స్క్రూటినీ కోసం పంపబడుతుంది.
- స్క్రూటినీ పూర్తైన తర్వాత JD ఆమోదం ఇస్తారు.
- Final Proceedings అప్లోడ్ అవుతుంది.
కొత్త విధానంలో ప్రత్యేక అంశాలు
- మొదటి స్థాయిలో DDO / MEO / HM కి అప్లికేషన్ వెళ్తుంది.
- ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పోస్టు వివరాలు కూడా ఆన్లైన్లో కనిపిస్తాయి.
- Candidate తన అప్లికేషన్ స్థితిని ఇంటి నుంచే తెలుసుకోవచ్చు.
- పారదర్శకత మరియు పెండెన్సీ తగ్గించడం ప్రధాన లక్ష్యం.
● అమలు తేదీలు :
- 16-05-2026 సాయంత్రం వరకు పాత లాగిన్లు క్లియర్ చేయబడతాయి.
- 17-05-2026 నుండి కొత్త సిస్టమ్ ప్రారంభం.
- 18-05-2026 నుండి పూర్తిస్థాయి అమలు.

Please Post a Comment